రోటి గూడ గ్రామంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రోటి గూడ గ్రామంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ జిల్లా పెళ్లి గోపాల్ తెలిపారు. గ్రామంలో పాత పడి చెడిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని గ్రామ అభివృద్ధికి గ్రామస్తులు పంచాయితీకి సహకరించాలని ఆయన కోరారు.