'వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది': నెల్లిమర్లలో మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: అశోక్ స్థలం: నెల్లిమర్ల

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి సమీపంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళను హత్య చేసి గోనె సంచిలో మూటకట్టి తుప్పల్లో పడేసిన ఘటన కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలానికి చెందిన మహిళను పూసపాటిరేగ మండలానికి చెందిన ఎల్‌.బంగారుబాబు సోమవారం తన ఇంటికి పిలిపించుకుని వాగ్వాదానికి దిగి, ఛాతిపై కూర్చొని నోరు, ముక్కు గట్టిగా నొక్కి హత్య చేశాడు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడు బంగారుబాబును రాత్రికి రాత్రే అరెస్టు చేశారు.