నాలుగు రాష్ట్రాల శాసనమండలి స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: భారతదేశం

భారత ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాల్లోని 28 శాసనమండలి స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో 11, బీహార్‌లో 8, మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 4 స్థానాలకు అక్టోబర్ 23న పోలింగ్ నిర్వహించి, అక్టోబర్ 27న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల కానుండగా, అక్టోబర్ 6 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.