యువతకు ఉపాధి బాటలు వేస్తూ సబ్బుల తయారీ యూనిట్ ప్రారంభం

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: పెదబయలు

పెదబయలు మండలం: పెదకొడాపల్లి పంచాయతీ మేరకచింత గ్రామంలో ఆదివాసీ మినీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామస్థాయి సబ్బుల తయారీ యూనిట్ను ప్రారంభించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.