ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన ఆర్టీసీ కండక్టర్ అరెస్ట్కు ఆదేశం

రిపోర్టర్: హరి స్థలం: Tadepalli

ఆర్టీసీ బస్సులో ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఒక మహిళను ప్రేమ పేరుతో నమ్మించి నగదు, బంగారం దోచుకోవడంతో పాటు లైంగిక దాడికి పాల్పడిన కండక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లాకు చెందిన బాధితురాలు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి తనకు జరిగిన మోసాన్ని వివరించి ఆధారాలు సమర్పించారు. వెంటనే స్పందించిన మంత్రి సమగ్ర విచారణ జరిపి నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని తిరుపతి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ను ఆదేశించారు.