ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన ఎస్ విజయకుమారికి అభినందనలు

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

వావిళ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న ఎస్. విజయకుమారి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై బెస్ట్ టీచర్ అవార్డు సాధించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారి విద్యా వికాసం, క్రమశిక్షణ, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్న ఆమెను పలువురు అభినందించారు.