షాకింగ్ ఘటన: బంజారాహిల్స్లో అరవై వేల బంగారు నగల పార్శిల్తో ఉడాయించిన డెలివరీ బాయ్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

యాప్ ఆధారిత పార్శిల్ డెలివరీ సేవలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. బంజారాహిల్స్ నుంచి నాగోలుకు పంపిన అరవై రెండు వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాల పార్శిల్ను డెలివరీ చేయకుండా ర్యాపిడో రైడర్ కాజేసి పరారయ్యాడని బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫోన్ నంబర్ బ్లాక్ చేసి మోసానికి పాల్పడిన డెలివరీ బాయ్ జాడ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.