తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కోడి మాంసం ధరలు ఒక్కసారిగా పైకి కదిలాయి. వివిధ మార్కెట్లలో డిమాండ్‌కు తగినట్లుగా కిలో చికెన్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.250 నుంచి రూ.265 వరకు అమ్ముడవుతుండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కిలో రూ.230 నుంచి రూ.260 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కిలో రూ.270, విశాఖపట్నంలో రూ.250, అనకాపల్లిలో రూ.260 వరకు పలుకుతోంది. ఉత్పత్తి వ్యయం పెరగడం, ఫారాల నుంచి సరఫరాలో మార్పుల కారణంగానే ఈ ధరల పెరుగుదల చోటుచేసుకున్నట్లు వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి.