ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ నిప్పులు: సీఈసీ తక్షణ రాజీనామాకు డిమాండ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఢిల్లీ
ఎన్నికల్ లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలతో పాటు ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణను వ్యతిరేకిస్తూ విపక్ష శ్రేణులు వేలాదిగా తరలివచ్చాయని, రాజధానిలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారని నిర్వాహకులు తెలిపారు.