విజయవాడ శాప్ కార్యాలయం ముట్టడి ఘటనలో వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు

రిపోర్టర్: శివ స్థలం: విజయవాడ

విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై సీబీఐ విచారణ కోరుతూ వైసీపీ నాయకులు చేపట్టిన ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన హింసాత్మకంగా మారడంతో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పేర్ని కిట్టు, నాగార్జున యాదవ్ సహా పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలపై మాచవరం పోలీసులు బీఎన్ఎస్ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.