మహేష్ బాబు వారణాసి సినిమాలో ఇరవై ఐదు నిమిషాల భారీ యుద్ధ ఘట్టం

రిపోర్టర్: రాజేష్ స్థలం: వారణాసి

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శ్రీరాముడు, కుంభకర్ణుడి మధ్య వచ్చే ఇరవై ఐదు నిమిషాల భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన హైలైట్ గా నిలవనుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వాల్మీకి రామాయణంలోని ఈ ఘట్టాన్ని రాజమౌళి తనదైన విజువల్ ట్రీట్ మెంట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.