నెల్లూరులో ఓటింగ్ పై స్పష్టమైన నిర్లక్ష్యం: నగరంలో తగ్గుతున్న పోలింగ్ శాతంపై తీవ్ర ఆందోళన

రిపోర్టర్: గోపి స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఓటింగ్ పై పౌరులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని వివిధ వర్గాల అధికారులు తెలిపారు. గత ఎన్నికల మాదిరిగానే నగరంలో కేవలం యాభై నుంచి అరవై శాతం మధ్యలోనే పోలింగ్ నమోదైందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఉద్యోగులు, విద్యావంతులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్ లో ఓటింగ్ శాతం అత్యంత దారుణంగా పడిపోయిందని, అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో విఫలమయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.