గ్రీన్ భద్రాద్రిని ఆదర్శంగా తీసుకుంటామన్న వరంగల్ అడిషనల్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్
రిపోర్టర్: సతీష్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాచలం పట్టణంలో గ్రీన్ భద్రాద్రి సంస్థ నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను వరంగల్ అడిషనల్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ 30 మంది మహిళా సమాఖ్య గ్రూప్ లీడర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ భద్రాద్రిని ఆదర్శంగా తీసుకొని వరంగల్ జిల్లాను కూడా పర్యావరణ హితంగా మారుస్తామని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం, ఇంకుడు గుంతల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.