పేదల కంటి వెలుగుకై జనతా ట్రస్ట్ సేవలు

రిపోర్టర్: Rajashekar స్థలం: నర్సంపేట

చెన్నరావుపేట మండల కేంద్రంలోని సిద్ధార్థ హైస్కూల్ ఆవరణలో శంకర కంటి ఆసుపత్రి మరియు జనతా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మూడవ విడత ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి సుమారు 677 మంది ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన 412 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయగా, శుక్లాలతో బాధపడుతున్న 65 మందిని ఉచిత శస్త్రచికిత్సల కోసం ఎంపిక చేశారు. ఆర్థిక స్థోమత లేని పేదలకు వైద్యం అందించడమే ట్రస్ట్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.