ఏఎఫ్‌సీ ఛాంపియన్స్‌ లీగ్‌లో అల్‌ నాసర్‌ ఘోర పరాజయం

రిపోర్టర్: రాజేష్ స్థలం: United Arab Emirates

ఏఎఫ్‌సీ ఛాంపియన్స్‌ లీగ్‌ ఎలైట్ మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్‌ నాసర్‌ జట్టుకు షాకింగ్ అనుభవం ఎదురైంది. అల్‌ ఐన్‌ జట్టు చేతిలో అల్‌ నాసర్‌ 4-0 తేడాతో ఘోర పరాజయం పాలైంది. రొనాల్డో అల్‌ నాసర్‌ తరఫున ఆడుతున్న కాలంలో ఇదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం. సౌదీ క్లబ్ తరఫున ఆడిన మ్యాచ్‌లలో ఇది కొత్త రికార్డు చెడ్డ ఓటమిగా నిలిచింది.