జిల్లా కోర్టులో మధ్యవర్తిత్వంపై తొంబై రోజుల అవగాహన కార్యక్రమం ప్రారంభం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా కోర్టులో మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి ఎం బబిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మధ్యవర్తిత్వ ప్రక్రియ సులువైనదని, ఖర్చు లేనిదని తెలిపారు. దేశవ్యాప్తంగా 90 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, సులువుగా కేసులు పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు.