నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కామన్ పరీక్ష నిర్వహణ
రిపోర్టర్: నరేష్
స్థలం: బెంగళూరు
కర్ణాటక పరీక్షా ప్రాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెచ్. ప్రసన్న వెల్లడించిన వివరాల ప్రకారం, వివిధ శాఖల్లోని సమాన అర్హతలు కలిగిన ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. దీనిద్వారా అభ్యర్థులపై ఆర్థిక భారం తగ్గనుండటంతో పాటు ఒకే దరఖాస్తుతో శాఖలకు పోటీపడే అవకాశం కలుగుతుంది. గతంలో మాదిరిగా విడివిడి నోటిఫికేషన్ల ఇబ్బందులు తొలగిపోనున్నాయి.