మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయి విమర్శలు

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రజా తీర్పు కాదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అధికార బలంతోనే ఫలితాలు సాధించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్లు వేసుకున్నది మీరే, గెలిచింది మీరే అంటే ప్రజాస్వామ్యంతో పనేముందని ప్రశ్నించారు. ఎన్నికల్ లో పారదర్శకత లేదని, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి విజయంపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్ లో కలకలం రేపాయి.