బొబ్బిలి శ్రీ సూర్య విద్యార్థులకు నైతిక విలువలతో కౌన్సెలింగ్ తరగతులు
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
బొబ్బిలి ఫ్లైఓవర్ సమీపంలోని శ్రీ సూర్య పాఠశాల విద్యార్థులకు బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సెలింగ్ తరగతులు నిర్వహించారు. బీకే రాజేశ్వరి అక్కయ్య మాట్లాడుతూ విద్యార్థుల మానసిక ఆరోగ్యం అత్యంత కీలకమని, భయాన్ని వీడితేనే గమ్యాన్ని చేరుకోగలమని తెలిపారు. పాఠ్యాంశాలను నిజ జీవితంతో అన్వయించి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.