బ్రిక్స్ సదస్సులో గ్లోబల్ లీడర్‌షిప్‌ను చాటుకునేందుకు భారత్‌కు కీలక అవకాశం.

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

అంతర్జాతీయ రాజకీయాల్లో అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ద్వారా గ్లోబల్ లీడర్ షిప్ సామర్థ్యాన్ని చాటుకునేందుకు భారత్‌కు సువర్ణావకాశం లభించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అమెరికా వ్యతిరేక వైఖరి మధ్య సమతుల్యత సాధిస్తూ దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో భారత్ దౌత్య నైపుణ్యం కీలకం కానుంది. గ్లోబల్ సౌత్‌కు భారత్ బలమైన గొంతుకగా మారుతోంది.