నియోజకవర్గంలో అభివృద్ధి నిధులు రావడం లేదంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆవేదన
రిపోర్టర్: హరి
స్థలం: మునుగోడు
మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి నిధులు రావడం లేదని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడులో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలా మాట్లాడాల్సి రావడం తన కర్మ అని వాపోయారు. రాష్ట్రంలో మంత్రులు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలకే నిధులు వెళ్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు.