ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారిణులను అభినందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: సూర్యాపేట

ఆసియా క్రీడలలో మహిళల నాలుగు ఇంటు నాలుగు వందల మీటర్ల రిలే విభాగంలో స్వర్ణ పతకం సాధించిన కిరణ్ పహల్, మాచెట్టిర పూవమ్మ, ప్రాచి మరియు విత్య రామ్రాజ్లను ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు. దేశానికి మరియు క్రీడాకారులందరికీ ఇది అత్యంత గర్వకారణమైన క్షణమని ఆయన ప్రశంసించారు. ఈ అద్భుత విజయం ద్వారా భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వేదికపై సమున్నతంగా నిలపడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.