పారిశుద్ధ్య లోపాలపై కొరడా ఝుళిపించిన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
ఏఎస్ రాజు నగర్లో చేపట్టిన పారిశుద్ధ్య పనులను డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక నివాసితులతో కలిసి బస్తీ దవాఖానాను సందర్శించి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఈఈ, ఎస్ఎస్, ఎస్ఆర్పీలు, ఎస్ఎఫ్ఏలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.