రామాయణ సినిమాపై హీరో యశ్ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

భారతీయ సినీ పరిశ్రమ స్థాయిని పెంచడంలో రాజమౌళి, ప్రభాస్, రామ్ చరణ్ వంటి ప్రముఖులు కీలక పాత్ర పోషించారని నటుడు యశ్ వెల్లడించారు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రామాయణ చిత్రంలో రావణుడి పాత్రలో నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి నటనను కొనియాడుతూ, అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమాకు మద్దతు ఇవ్వాలని కోరారు.