బాధిత కుటుంబానికి రూ. ఐదు లక్షల సీఎం సహాయనిధి అందించి అండగా నిలిచిన సురేఖ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: దండేపల్లి
పేదల వెంట కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల గూడెం గ్రామానికి చెందిన పంచర్పూల పోషయ్యకు వైద్య సహాయం నిమిత్తం సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల విలువైన ఎల్ఓసీ పత్రాన్ని మంగళవారం ఆమె బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.