రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పన్నెండో వేతన సవరణ సంఘం చైర్మన్గా దినేష్ కుమార్

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పన్నెండో వేతన సవరణ సంఘం చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఈ పదవిలో ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఒక సంవత్సరంలోపు కమిషన్ నివేదిక సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.