తూర్పుపల్లిలో శ్రీరాములస్వామి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పెనగలూరు
పెనగలూరు మండలంలోని తూర్పుపల్లి హరిజనవాడలో నూతనంగా నిర్మించనున్న శ్రీరాములస్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవాదాయశాఖ నిధులతో చేపట్టనున్న ఈ పనులకు వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రామస్థుల కల నెరవేర్చిందని, దీంతో భక్తులకు ఆధ్యాత్మిక వేదిక అందుబాటులోకి వస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.