కాంగ్రెస్ రాముడు బీజేపీ రావణుడనడం శతాబ్దపు మహా మోసమంటూ జి. కిషన్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని రాముడిగా, బీజేపీని రావణుడిగా అభివర్ణించడం శతాబ్దపు అతిపెద్ద కపట నాటకమని ఆయన మండిపడ్డారు. ఒకప్పుడు శ్రీరాముడి ఉనికినే పూర్తిగా వ్యతిరేకించిన వారు, ఇప్పుడు ఇలా మాట్లాడడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.