అసాంఘిక కార్యకలాపాలకు అడ్డజాగా మారిన చిన్నరావుపల్లి ఎంపీపీ పాఠశాల

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎచ్చెర్ల

ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలోని ఎంపీపీ పాఠశాల అసాంఘిక చర్యలకు నిలయంగా మారింది. రాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి మద్యం తాగుతూ సీసాలు పగలగొడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూం డోర్లు ధ్వంసం చేయడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రహరీ గోడ లేకపోవడంతోనే ఈ ఘటనలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి తక్షణమే రక్షణ గోడ నిర్మించాలని కోరారు.