పారిశ్రామిక రంగానికి పెద్ద ఊరట: దేశంలో ఆరో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Amaravati

దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఉన్న కర్మాగారాల సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచిందని కేంద్ర గణాంకాలు, అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కర్మాగారాల్లో ఏపీలో పదహారు వేలకు పైగా ఉన్నట్లు వార్షిక సర్వే తెలిపింది. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు తొలి స్థానాల్లో నిలవగా, తయారీ రంగంలో గణనీయమైన వృద్ధి నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు.