కర్ణాటక రాజకీయాల్లో కలకలం: కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: బెంగళూరు

కర్ణాటకలో ఎన్నికలు ప్రకటిస్తే కాంగ్రెస్ మంత్రులతో సహా 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి మారుతారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరినీ ఆకర్షించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ నాయకులను వెంటనే మీ పార్టీలోకి చేర్చుకోండి అంటూ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎగతాళి చేశారు. కాంగ్రెస్ మంత్రులను ఇరికించేందుకు స్టింగ్ ఆపరేషన్లు జరుగుతున్నాయని విజయేంద్ర ఆరోపించారు.