హైదరాబాద్లో భారీ సైబర్ మోసం గుట్టురట్టు: అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: తిరుపతి
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చిన ఘరానా మోసగాడిని తిరుపతి జిల్లా అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారని సీఐ రామ కిషోర్ తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన గుండుబోయన నరేష్ అనే వ్యక్తి హోంగార్డుగా చెలామణి అవుతూ ఇద్దరి నుంచి దాదాపు ఆరు లక్షల తొంబై ఐదు వేల రూపాయలు వసూలు చేశాడని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.