గెస్ట్‌హౌస్‌కు రావాలని సీఎం సన్నిహితుడు వేధించారంటూ కె శోభారెడ్డి సంచలన ఆరోపణలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
తన వ్యాపార సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే, సీఎంకు సన్నిహితుడైన వ్యక్తి ఒకరు గెస్ట్‌హౌస్‌కు రావాలని కోరారంటూ మిథునా యాడ్స్ అధినేత కె. శోభారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు మెసేజ్ చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, తనను బెదిరిస్తే మరిన్ని పేర్లు బయటపెడతానని హెచ్చరించారు.