భార్య, ముగ్గురు కూతుళ్ల హత్య కేసులో నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: రాజస్థాన్
రాజస్థాన్లోని జైపూర్లో భార్య, ముగ్గురు కూతుళ్లను దారుణంగా హత్య చేసి పరారైన నిందితుడు రాహుల్ ఝాను సీకర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిద్రమత్తులో లేదా విషం ఇచ్చి, బండరాయితో తలపై కొట్టి వారిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడి కదలికలను పసిగట్టి రీంగస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.