దీన్దయాళ్ ఉపాధ్యాయ ఏడు సూత్రాలు కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమన్న సుజనా చౌదరి

రిపోర్టర్: సునీల్ స్థలం: ఎన్టీఆర్

పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తుచేసిన ఏడు సూత్రాలు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సేవా ప్రయాణానికి మరియు ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ అత్యంత స్ఫూర్తిదాయకమని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వై.ఎస్. చౌదరి (సుజనా చౌదరి) వెల్లడించారు. సేవా భావం, సమతుల్యత, సంయమనం, ఐక్యత, సానుకూల దృక్పథం, సానుభూతి, సంభాషణ అనే ఈ అమూల్యమైన సూత్రాలను ఆచరిస్తూ ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు.