భారత్‌లో అమేజాన్ క్రియేటర్ కనెక్షన్స్ కార్యక్రమం ప్రారంభం

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు సుస్థిరమైన ఆదాయ మార్గాలను అందించేందుకు అమేజాన్ భారతదేశంలో 'క్రియేటర్ కనెక్షన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది క్రియేటర్లను ప్రముఖ బ్రాండ్ల క్యాంపైన్లతో అనుసంధానించడమే దీని ముఖ్య ఉద్దేశం. అఫిలియేట్ లింక్స్ ద్వారా జరిగే కొనుగోళ్ల ఆధారంగా క్రియేటర్లు ప్రతిఫలం పొందే వీలుంది.