అంగన్వాడీ సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందడుగు
రిపోర్టర్: వెంకట్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
అంగన్వాడీ సిబ్బందికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రాంతానికి చెందిన పాశం సునీల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలను పెంచి వారి సంక్షేమానికి పెద్దపీట వేసిందని స్పష్టం చేశారు. కష్టకాలంలోనూ సిబ్బందికి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం నిబద్ధత చాటుకుందని, మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.