దీపావళి బరిలో నయనతార మహాశక్తి చిత్రం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న దైవిక చిత్రం 'మూకుత్తి అమ్మన్ 2'. తెలుగులో ఈ చిత్రాన్ని 'మహాశక్తి' పేరుతో విడుదల చేస్తున్నారు. మొదటి భాగం విజయం సాధించడంతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపావళి కానుకగా నవంబర్ మొదటి వారంలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఇతర పాన్-ఇండియా సినిమాలతో ఈ చిత్రం గట్టి పోటీ పడనుంది.