బీసీసీఐ కీలక నిర్ణయం: ఇకపై ఎంపిక సమావేశాలకు వీవీఎస్ లక్ష్మణ్
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ఆటగాళ్ల గాయాలు మరియు సమాచార లోపాన్ని నివారించేందుకు ఇకపై జరిగే అన్ని ఎంపిక సమావేశాలకు నేషనల్ క్రికెట్ అకాడమీ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ క్రమం తప్పకుండా హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సైకియా వెల్లడించారు.