అక్కపెళ్లిగూడ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలతో అధికారుల పర్యవేక్షణ ముమ్మరం

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామంలో ఉన్న అక్క పెళ్లి గూడ ప్రభుత్వ పాఠశాలను కరీంనగర్ జిల్లా సెక్టోరియల్ అధికారులు సందర్శించారు. సోమవారం ఉదయం వారు పాఠశాలను పరిశీలించి హెచ్ఎం జాజాల శ్రీనివాస్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల బోధన మీదనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి అశోక్ రెడ్డి జి సి డి ఓ ఉషారాణి పాల్గొన్నారు.