విశాఖ తీరంలో తీవ్ర విషాదం: అలల తాకిడికి ముగ్గురు బాలురు గల్లంతు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం రుషికొండ తీర ప్రాంతంలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు బాలురు సముద్రపు అలల తాకిడికి గురై నీటిలో గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. వారాంతం కావడంతో తీరానికి చేరుకున్న వారు ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతానికి వెళ్లడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన మెరైన్ సిబ్బంది, పోలీసులు మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో బాలురుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.