వియత్నాం ఎయిర్పోర్టులో భారతీయుల భోజనం: సోషల్ మీడియాలో తీవ్ర దుమారం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

విదేశీ ప్రయాణాల్లో పబ్లిక్ మర్యాదలు పాటించాలంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోందని నెటిజన్లు వెల్లడించారు. వియత్నాం అంతర్జాతీయ విమానాశ్రయంలో కొంతమంది భారతీయ పర్యాటకులు నేలపై కూర్చుని వార్తాపత్రికలపై భోజనం చేయడం వైరల్ అయింది. ఈ ఘటనపై కొందరు తప్పుపడుతుంటే, మరికొందరు కుటుంబంతో ఆనందంగా గడపడంలో తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ వింత ప్రవర్తనపై నెటిజన్ల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది.