గుజరాత్‌లో గర్బా భాగస్వాముల అద్దె ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ దర్యాప్తు

రిపోర్టర్: నరేష్ స్థలం: Gujarat

గుజరాత్‌లో నవరాత్రి వేడుకల సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గర్బా భాగస్వాముల అద్దె ప్రకటనలపై అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా దృష్టి సారించారు. గర్బా భాగస్వాములను అద్దెకు ఇస్తామంటూ రకరకాల ధరలతో వస్తున్న ప్రకటనలు మోసాలకు తెరతీసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ ట్రెండ్ వెనుక అసలు ఉద్దేశం ఏంటో తేల్చేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.