జాతీయ స్థాయి త్రో బాల్ పోటీలకు దర్శి విద్యార్థుల ఎంపిక
రిపోర్టర్: మహేష్
స్థలం: ప్రకాశం
ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థులు వై. నందిని, జే. పవిత్ర జాతీయ స్థాయి త్రో బాల్ పోటీలకు ఎంపికయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ చాటి రాష్ట్ర జట్టుకు అర్హత సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈనెల 27 నుంచి 30 వరకు మహారాష్ట్రలోని నాసిక్‌లో నిర్వహించే జాతీయ పోటీల్లో వీరు పాల్గొననున్నారు.