టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం: ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ప్యాకేజీలు
రిపోర్టర్: రమేష్
స్థలం: అంతర్జాతీయం
కృత్రిమ మేధ రంగంలో భారీ వ్యయాలను నియంత్రించే ఉద్దేశంతో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ప్యాకేజీల ప్రక్రియను అంతర్జాతీయంగా విస్తరిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ దేశాలలో ఈ ప్యాకేజీలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యయ నియంత్రణతో పాటు ప్రాధాన్య రంగాలపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ వెల్లడించింది.