తెలంగాణలో విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

శాసనసభలో తెలంగాణ విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విద్య లేకపోవడమే సామాజిక వెనుకబాటుతనానికి కారణమని సీపెక్ సర్వేలో తేలిందన్నారు. విద్యా శాఖపై తనకు ప్రత్యేకమైన ప్యాషన్ ఉందని, అందుకే ఆ శాఖను తన దగ్గరే ఉంచుకున్నానని స్పష్టం చేశారు. మూడేళ్లలో విద్యా శాఖ బడ్జెట్‌ను భారీగా పెంచామని, అధికారంలోకి రాగానే 55 రోజుల్లోనే 10,006 ఉపాధ్యాయ పోస్టులను ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా భర్తీ చేశామని తెలిపారు.