'నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు': వాయు కాలుష్య నియంత్రణపై సీఏక్యూఎం హెచ్చరిక
రిపోర్టర్: వెంకట్
స్థలం: న్యూఢిల్లీ
జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్య కట్టడి కోసం కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7 మధ్య ఎన్సీఆర్ పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ 150కి పైగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. నిబంధనలు పాటించని మూడు నిర్మాణ ప్రాజెక్టులు, ఒక పారిశ్రామిక యూనిట్ మూసివేతతో పాటు 25 డీజిల్ జనరేటర్లను సీజ్ చేయాలని ఆదేశించారు. హర్యానాలోని నూహ్, ఉత్తరప్రదేశ్ లోని హాపుర్ ప్రాంతాల్లోనూ ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి కాలుష్య కారక యూనిట్లపై కఠిన చర్యలు సిఫారసు చేశారు.