ప్రజా సానుకూలతను మరింత పెంచాలి: జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు మరియు సంక్షేమ పథకాల సేవలపై ప్రజల సానుకూల అభిప్రాయాన్ని మరింత మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు నిర్వహించిన ఐవీఆర్ఎస్ కాల్స్ నివేదికపై ఆయన సోమవారం సమీక్ష జరిపారు. ప్రజల నుంచి నమోదవుతున్న సానుకూల మరియు ప్రతికూల అభిప్రాయాలను సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పరిశీలిస్తూ, సేవల నాణ్యతను మరింత పెంచాలని ఆయన సూచించారు.