సోషల్ మీడియా వేధింపులపై కేటీఆర్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇందుజా బల్మూరి

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సతీమణి ఇందుజా బల్మూరి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ఆశ్రయించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సైబర్ ఫిర్యాదు చేశారు. తన ప్రీ-వెడ్డింగ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకర రీతిలో ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కులపిచ్చితోనే తన వ్యక్తిగత జీవితంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కొలేక కుటుంబాలపై దాడులు చేయడం సరికాదని ఇందుజా స్పష్టం చేశారు.