బాబు ఇచ్చిన హామీ మేరకు ప్రజల చేతికే భూమి

రిపోర్టర్: విజయ్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనలో భాగంగా ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కీలక నిర్ణయాలు అమలవుతున్నాయి. బాబు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ మొత్తం 28,445 కుటుంబాలకు భూమిపై పూర్తి హక్కులు అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో విశాఖ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, ఇది మంచి ప్రభుత్వమంటూ కూటమి పాలనపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.